కామారెడ్డి అర్బన్: జిల్లాలో మున్నూరుకాపు మండల యూత్, మహిళా విభాగాలను బలోపేతం చేయడంతో పాటు కుటుంబ సర్వే నిర్వహించాలని తెలంగాణ మున్నూరుకాపు సంఘం కామారెడ్డి జిల్లా ఇంచార్జి దేమె యాదగిరి పటేల్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా సమావేశం నిర్వహించి వివిధ సమస్యలు, సంఘం బలోపేతం విషయాలపై చర్చించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి నీలం నర్సింలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గడీల భాస్కర్, నాయకులు రాంకుమార్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ద్వారా దుబాయ్‌లో ఉద్యోగాల కోసం 18 –40 మధ్య వయసు గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. టైల్ మెషిన్, షట్టరింగ్ కార్పెంటర్, ఆర్‌సీసీ వర్కర్, స్టీల్ ఫిక్సర్, స్కాఫోల్డర్, జనరల్ హెల్పర్ పోస్టులున్నాయని, నెలకు రూ.37,800ల వేతనం, ఫుడ్ అలవెన్స్, ఓవర్‌టైం, బోనస్ ఉంటుందన్నారు. వివరాలకు 83286 02231, 94400 50951, 94400 51452 నంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు.
కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం(తపస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘బడిబాట’ పోస్టర్‌ను డీఈవో ఎస్. రాజు బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఈవో మా ట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు నైతిక విలువలను అందించేది కేవ లం ఉపాధ్యాయులేనని అన్నారు. జిల్లాలోని బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని,సర్కారు కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవాలని కో రారు. తపస్ రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరె డ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉ పాధ్యక్షులు ఆంజనేయులు,రాజశేఖర్, మండ ల బాధ్యులు దత్తాచారి, స్వామి పాల్గొన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేశారు. సీతాయిపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు సీతాయిపల్లిలో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు భూమిపూజ చేశారు.


