క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి పిడుగుపాటుకు గేదె.. ఇసుక అక్రమ రవాణా.. ఇద్దరిపై కేసు

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని మేనూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం హైవే అథారిటీకి చెందిన వాహనాన్ని వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టిన ఘటనలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్‌ కండక్టర్‌ అబ్దుల్‌ నజీర్‌(42) మృతి చెందాడని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్‌ నజీర్‌ బుధవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని మద్నూర్‌ మీదుగా మేనూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. మహారాష్ట్రలోని భోకర్‌కు చెందిన అబ్దుల్‌ నజీర్‌కు మండలంలోని మేనూర్‌కు చెందిన అమ్మాయితో వివాహం కాగా, మేనూర్‌లోని ఉంటున్నారన్నారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

భిక్కనూరు: పిడుగుపాటు కారణంగా పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బొండ్ల శివయ్య అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద ఉన్న పశువుల కొట్టంలో గేదెను కట్టేశాడు. అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పాడి గేదైపె పిడుగుపడడంతో మృతి చెందింది. బాధిత రైతు పశువైద్యాధికారులకు సమాచారం అందించాడు. తనకు నష్టపరిహారం అందించాలని అధికారులను కోరాడు.

కరెంట్‌ షాక్‌తో..

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రానికి చెందిన పాటిమీది మల్లేశ్‌ అనే వ్యక్తికి చెందిన గేదె బుధవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందింది. బూర్గుల్‌ గ్రామ శివారులో మేతకు వెళ్లిన గేదె బాన్సువాడ– ఎల్లారెడ్డి రహదారి పక్కన ఉన్న పంటపొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాడి గేదె మృతితో రైతుకు రూ.60 వేల వరకు నష్టం వాటిల్లింది.

రుద్రూర్‌: పొతంగల్‌ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్‌ తెలిపారు. బుధవారం ఉదయం ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్‌ చేసుకుని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. డ్రైవర్‌ రాజుతోపాటు ట్రాక్టర్‌ యజమాని రాజేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement