పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

భిక్కనూరు: పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్‌ చంద్ర తెలిపారు. బుధవారం భిక్కనూరు టోల్‌ ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన చెక్‌ పోస్ట్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పశువుల అక్రమ రవాణా లేదా ఎలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాడిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌, ఎస్సైలు నరేష్‌, ఆంజనేయులు, ప్రభాకర్‌లున్నారు.

బాధితులతో గౌరవంగా వ్యవహరించాలి

కామారెడ్డి క్రైం: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేష్‌ చంద్ర సూచించారు. వార్షిక తనిఖీల్లో బుధవారం దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌న్‌ను ఆయన సందర్శించారు. పరిసరాలను, రికార్డులను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్‌, రూరల్‌ సీఐ శ్రీధర్‌ గౌడ్‌, దేవునిపల్లి ఎస్సై రంజిత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది

కామారెడ్డి క్రైం: పదోన్నతితో పోలీసులకు గుర్తింపుతో పాటు బాధ్యత పెరుగుతుందని ఎస్పీ రాజేష్‌ చంద్ర అన్నారు. బీబీపేట పీఎస్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూధన్‌ రావు ఎస్సైగా పదోన్నతి పొందారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసి ఎస్పీ రాజేష్‌చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. మధుసూధన్‌ రావుకు పదోన్నతి చిహ్నాలను ఎస్పీ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement