సుభాష్‌నగర్: ఉమ్మడి జిల్లా రైతాంగానికి సరిపడా యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయాలని, అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని తన కార్యాలయంలో రమేశ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యూరియా, ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో యూరియా బఫర్ స్టాక్, ఇతరాత్ర సమస్యలను మంత్రికి వివరించారు.
మద్నూర్(జుక్కల్): మండలంలోని రుసేగావ్ గేట్ వద్ద 161వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున మామిడి పండ్ల లారీ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్‌కు మామిడి పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ మండలంలోని రుసేగావ్ గేట్ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. మామిడిపండ్లు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండుగంటలపాటు శ్రమించి క్రేన్ సహాయంతో లారీని పక్కకు జరిపారు. రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.


