డొంకేశ్వర్(ఆర్మూర్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విత్తన కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) రఘు ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. మంగళవారం బదిలీ ఉత్తర్వులు వెలువడగా, జిల్లాకు వినయ్ ఆర్‌ఎంగా రానున్నారు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర శాఖ నుంచి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు.
డాక్టర్ జీవీ రావుకు
శుభాకాంక్షలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్ జీవీ రావును మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. వైద్య రంగంలో డాక్టర్ జీవీ రావు అందిస్తున్న విశిష్ట సేవలను ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు.
బోధన్: ఎడపల్లిలో ని రైతువేదిక భవ నం వద్ద వీధి కుక్క లు గుంపులుగా సంచరిస్తూ మంగళవా రం ఉదయం లక్ష్మి అనే మహిళపై దాడి చేశాయి. భయంతో లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై కుక్కలను తరిమివేసి ఆమెను కాపాడారు. తీవ్రగాయాలపాలైన లక్ష్మిని చికి త్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానిక నాయకుడు న్యావనది శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి నాగరాజుగౌడ్‌కు విన్నవించారు.
బాన్సువాడ : ఇద్దరు చిన్నారులు ఆస్పత్రి ప్రాంగణంలో దిక్కుతోచని స్థితిలో అటూఇటూ తిరుగుతుండడంతో ఆస్పత్రి సిబ్బంది చూసి లోపలికి తీసుకెళ్లి ఓ గదిలో సంరక్షణ కల్పించారు. చిన్నారులు అధికారులకు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామానికి చెందిన లక్ష్మి తన ఇద్దరు కూతుర్లు గంగోత్రి (10వ తరగతి), హాసిని (2వ తరగతి) లను తీసుకుని శనివారం బాన్సువాడ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఇద్దరు చిన్నారులను కూర్చొబెట్టి ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్లిపోయింది. రాత్రయినా లక్ష్మి రాకపోవడంతో చిన్నారులిద్దరు ఆస్పత్రిలో తిరుగుతుండడంతో సిబ్బంది సుపరింటెండెంట్ విజయభాస్కర్‌కు సమాచారం ఇచ్చారు. చిన్నారులకు గదిలో వసతి కల్పించి భోజనం పెట్టండి అని చెప్పడంతో సిబ్బంది చిన్నారులకు భోజనం తెప్పించి తినిపించారు. మూడు రోజులైన చిన్నారుల తల్లి రాకపోవడంతో మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తన తండ్రి చనిపోయాడని చిన్నారులు అధికారులకు వివరించారు.


