నేటి నుంచి పాలిటెక్నిక్‌ స్లాట్‌ బుకింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాలిటెక్నిక్‌ స్లాట్‌ బుకింగ్‌

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

ఇవి గుర్తుంచుకోండి..

ముఖ్యమైన తేదీలు ఇవే..

జిల్లాలో కళాశాలలు – సీట్లు

జిల్లాలో ఐదు కళాశాలలు

అందుబాటులోకి కొత్త కోర్సులు

ఖలీల్‌వాడి: విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడే పాలిటెక్నిక్‌ స్లాట్‌ బుకింగ్‌ నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. పాలిసెట్‌ ఫలితాలు విడుదల కావడంతో పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ భారతి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్‌లో పలు కొత్త కోర్సులు వచ్చాయి. ఆటోమిషన్‌ ఇన్‌ రోబోటిక్‌, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ చదివే అవకాశం ఏర్పడింది.

పాలిసెట్‌ ర్యాంక్‌ కార్డ్‌, పాలిసెట్‌ హాల్‌ టికెట్‌, పదో తరగతి మార్కుల మెమో, బదిలీ సర్టిఫికెట్‌ (టీసీ), స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్‌), కుల ధ్రువీకరణ పత్రం(అవసరమైతే), ఈడబ్ల్యూ విద్యార్థులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్‌, ఎన్సీసీ, క్యాప్‌, క్రీడా సర్టిఫికెట్లు (అర్హత ఉన్నవారికి), పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, 2026 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధ్రువపత్రం సమర్పించిన విద్యార్థులకు కళాశాల ఫీజు రూ.1880 మాత్రమే ఉంటుంది.

స్లాట్‌ బుకింగ్‌ 27 నుంచి 31

ధ్రువపత్రాల పరిశీలన 29 నుంచి జూన్‌ 1

ఆప్షన్ల ఎంపిక 29 నుంచి జూన్‌ 3

సీట్ల కేటాయింపు జూన్‌ 6

రిపోర్టు గడువు జూన్‌ 7 నుంచి 8

Advertisement
 
Advertisement
Advertisement