● ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
● మల్లారం చెరువు మరమ్మతులకు రూ.1.65 కోట్లు మంజూరు
లింగంపేట(ఎల్లారెడ్డి): నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం ఆయన లింగంపల్లి(ఖుర్దు) శివారులోని మల్లారం చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించి మాట్లాడారు. గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల మండలంలో తీవ్ర నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయన్నారు. వరదల వల్ల చెరువులు, కుంటలు, వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయన్నారు. తాను వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక మరమ్మతులు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మల్లారం చెరువుతో పాటు అభివృద్ధి పనులకు వరద నష్టం మరమ్మతుల నిధుల కింద రూ.1.65 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రతి పక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చెరువు కట్టల మరమ్మతులు వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం
లింగంపేట మండల కేంద్రంలోని అజయ్ ఆస్పత్రి భవనంపైన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సాయి రాంయాదవ్, సర్పంచులు ప్రత్యూష, కౌడ రవీంద ర్, ఉపసర్పంచ్ ప్రసాద్‌గౌడ్, సర్పంచుల ఫోరం అ ధ్యక్షుడు సక్రూనాయక్, తదితరులు పాల్గొన్నారు.


