బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు సూచించారు. మంగళవారం బాన్సువాడలో బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరా డాలన్నారు. శిబిరం రెండు రోజుల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ, నాయకులు అరుణతార, మురళీధర్‌గౌడ్, రంజిత్‌మోహాన్, బాణాల లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కోనాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట: ప్రభుత్వం వెంటనే ప్రాణహిత –చే వెళ్ల 22వ ప్యాకేజీ పనులను ప్రారంభించాలని జలసాధన సమితి కన్వీనర్ వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 31న కామారెడ్డిలోని కర్షక్ బీఈడీ కళాశాలలో నిర్వహించే సమితి రౌండ్ టేబుల్ సమావేశం కరపత్రాలను మంగళవారం బీబీపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి సమస్యపై 2005లో బీబీపేట పెద్ద చెరువు నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. ప్రాణ హిత పనులు పూర్తయితేనే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ ప్రణాళిక చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి కమిటి కోకన్వీనర్ రాజేశ్వర్, సభ్యుడు రవి గౌడ్, ఉపసర్పంచ్ ప్రశాంత్ పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లాలోని వివిధ కోర్టులు మంగళవారం 43 మందికి శిక్షలు విధించాయి. ఐదుగురికి ఒకరోజు, ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు మొత్తం 43 మందికిగాను రూ. 51,800 జరిమానా విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
● 19 జీవాలు మృత్యువాత
కామారెడ్డి క్రైం: రైలు ఢీకొన్న ఘటనలో 19 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామానికి చెందిన కుర్మ ఆరెల్లి లక్ష్మి మంగళవారం తన గొర్రెల మందను మేత కోసం తీసుకువెళ్లింది. తిరుగు ప్రయాణంలో రైలు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా వచ్చిన రైలు మందను ఢీకొంది. ఈ ప్రమాదంలో 19 గొర్రెలు మృతిచెందాయి. వాటి విలువ రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు తెలిపింది.


