కామారెడ్డి అర్బన్: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత సూచించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్‌లో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు పొందిన వైశ్య విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. 56 మంది విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా స్థాయి విద్యార్థుల అభినందన సభ నిర్వహించడాన్ని అభినందించారు. కార్యక్రమంలో జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ దుద్దెల శ్రీనివాస్‌గుప్తా, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ నీల బాలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలువేరి మారుతి, జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, ప్రతినిధులు సుధాకర్, వెంకటేష్, బుక్క రజని, అన్నపూర్ణ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


