కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ టి పర్వతాలు ఆకస్మిక సెలవు పెట్టి వె ళ్లిపోయారు. ఒత్తిడి తట్టుకోలేకే ఆయన సోమ వారం రాత్రి 8 గంటలకు అధికారిక సిమ్ కార్డును కార్యాలయంలో అప్పగించేసి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈనెల 4వ తేదీన బాధ్యతలు చేపట్టిన పర్వతాలు 22 రోజులకే వెళ్లిపోవడానికి తీవ్ర ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గతంలో పనిచేసిన కమిషనర్ రాజేందర్‌రెడ్డిని సైతం కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వచ్చిన కమిషనర్ 22 రోజులకే చేతులెత్తేశారు.
సరెండర్ చేయండి లేదంటే
సస్పెండ్ చేయించండి..
ఇటు కౌన్సిలర్లు, అటు ప్రజాప్రతినిధుల భర్తల ఆధిపత్య పోరుతో కమిషనర్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది. వీటికి తోడు ఓ పండుగ ఏర్పాట్ల విషయంలో సైతం కొందరు కౌన్సిలర్లు ఉన్నతాధికారుల ముందే కమిషనర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో మనోవేదనకు గురైన పర్వతాలు.. తనకు సెలవులు కావా లని ఉన్నతాధికారులను వేడుకున్నట్లు తెలిసింది. చైర్‌పర్సన్ చాంబర్‌లో నిర్వహించిన మీటింగ్‌లో నూ ఆయన మాట్లాడుతూ.. సెలవుపై వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ప్రభుత్వానికి సరెండర్ చేసినా, సస్పెండ్ చే యించినా ఫర్వాలేదని ఆవేదన తో మాట్లాడినట్లు సమాచారం.
ప్రశ్నలు.. నిలదీతలు..
మున్సిపల్ కార్యాలయంలో సో మవారం మధ్యాహ్నం 2 గంటలకు చైర్‌పర్సన్ చాంబర్‌లో అధికారులతో సమీక్షాసమావేశం ఏ ర్పాటు చేశారు. అయితే కమిషనర్‌తోపాటు ఏ ఒక్క అధికారి సకాలంలో రాకపోవడంతో చైర్‌పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందే కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశానికి వెళ్లడం వల్లే ఆలస్యమైందని కమిషనర్ వివరణ ఇస్తూ.. చైర్‌పర్స్‌కు క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. అయితే, సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు ఎందుకు వెళ్లారంటూ ఓ ప్రజాప్రతినిధి భర్త అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. గతంలో ఓ మహిళా ఉద్యోగినిని, ఇటీవల టీపీబీఈవోపై ఆ ప్రజాప్రతినిఽధి భర్త పెత్తనంతో దూషించడం, తాజాగా కమిషనర్‌పై కూడా ఆగ్రహించడంతో కార్యాలయంలో ఆయన వ్యవహార శైలి చర్చనీయాశమైంది.
ఫిర్యాదు
సమావేశం ప్రారంభానికి ముందే చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణితోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపుకలెక్టర్ ఏవీ గిరికి కమిషనర్ పర్వతాలుపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షాసమావేశానికి ప్రోలోకాల్‌కు విరుద్ధంగా కమిషనర్ హాజరయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సిమ్‌కార్డును ఆఫీస్‌లో ఇచ్చేసి
వెళ్లిపోయిన పర్వతాలు
బాధ్యతలు చేపట్టిన 22 రోజులకే
వెనుదిరిగిన అధికారి
ఒత్తిళ్లను తట్టుకోలేకేనా..?


