మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు

May 26 2026 3:14 AM | Updated on May 26 2026 3:14 AM

అద్దె బస్సుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నే తృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే పి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాన్ని పురస్కరించుకుని మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను వారికి అందజేశారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ మ హిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణా లు అందించడమే కాకుండా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూ ల్‌ యూనిఫాంల స్టిచింగ్‌, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తోందన్నారు. జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలకు.రూ. 1100 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు 18 అద్దె బస్సులను కేటాయించిందని, అద్దె బస్సుల నిర్వహణను పక్కాగా పర్యవేక్షణ జరపాలని సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. నగరంలో కలెక్టరేట్‌కు ఆనుకు ని అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన ఇంది రా మహిళా శక్తి భవనం త్వరలోనే అందుబాటులో కి రానుందని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్‌ భుజంగరావు, డీఆర్డీఏ సాయన్న, ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న, డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌ రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, మండల మహిళా సమాఖ్యల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement