డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొన్ని రోజులుగా ఉత్సాహాంగా సాగిన వేసవి శిబిరాలు (సమ్మర్ క్యాంపులు) ఘనంగా ముగిశాయి. కేవలం చదువుకే పరిమితం కాకుండా సెలవుల్లో విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ క్యాంపులను నిర్వహించారు. సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వస్తువులు, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, హస్తకళలు, సందేశాత్మక చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ 15 రోజుల్లో విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు మెరుగవగా, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. నైపుణ్యాలు బయటకు వెలికి తీసి వారిలో భయాన్ని పోగొట్టారు. హెచ్‌ఎం సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్యూటర్లుగా నియమింపబడిన స్వప్న, సంధ్యా, సాధన, రమేశ్ విద్యార్థులకు శిక్షణనిచ్చారు.
6వ తరగతి పూర్తి చేసిన అఖిల సమ్మర్ క్యాంప్‌లో చేరిన వారం రోజుల్లోనే నైపుణ్యాన్ని రెట్టింపు చేసుకుంది. కృత్రిమంగా పూల బొకెలు, జాయింట్ వీల్స్‌ను తయారు చేసింది. అలాగే 32 రకాల డ్రాయింగ్స్‌ను కూడా వేసింది.
సరికొత్త నైపుణ్యాలతో మెరిసిన
డొంకేశ్వర్ పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులు
డ్రాయింగ్, పెయింటింగ్ రూపంలో సందేశాత్మక చిత్రాలు


