నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఫూలాంగ్ వాగు సమీపంలో ఆదివారం జరిగిన హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్ తెలిపారు. అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనకాల ఉన్న కల్లు బట్టిలో రాత్రి నలుగురు మధ్య గొడవ జరిగింది. పాటిగల్లికి చెందిన షాకీర్, శివ కలిసి బట్టీలో కల్లు సేవిస్తున్నారు. అక్కడ మరో ఇద్దరితో వీరికి గొడవ జరిగింది. షాకీర్‌ను బయటకు తీసుకొచ్చి బండరాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. ఘటనపై ఎస్‌హెచ్‌వో సతీశ్ విచారణ జరిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.


