నిజామాబాద్‌అర్బన్ : చైన్ చోరీ చేసిన కేసులో ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఈ నెల 20న శుభకార్యానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ వృద్ధురాలిని ఖానాపూర్‌కు చెందిన డ్రైవర్ విజయ్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కున్నాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


