భిక్కనూరు : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం అంతంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.అనంతరం షబ్బీర్ అలీ మా ట్లాడుతూ..అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభు త్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గు ర్తు చేశారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధా న్యత ఉంటుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎ న్నారై సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి అఖిల్, నాయకులు సంజీవరెడ్డి, గంగారెడ్డి తదితరులున్నారు.
కామారెడ్డి అర్బన్: రోహిణి కార్తె సోమవారం ప్రారంభమైంది. రైతులు రోహిణి కార్తె నుంచి తమ వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. పంట చేలల్లోకి పశువుల పెంట, సేంద్రియ ఎరువులను తోలడం ప్రారంభిస్తారు. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలిపోతాయని, అంటే అంతగా ఎండలు దంచికొడుతాయని అంటారు. రోహిణి కార్తె అనంతరం మిర్గం..మృగశిర కార్తె నుంచి రైతులు ఆకాశానికేసి వానలు కోసం చూస్తారు. రోహిణికార్తెలో వానలు కురిసి వెంటనే విత్తనాలు వేస్తే రోకళ్లలాంటి పంట పండుతుందని నానుడి. అంటే పంట దిగుబడి వస్తుందని నమ్ముతారు. సోమవారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
భిక్కనూరు: రోహిణి కార్తె ప్రారంభం సందర్భంగా సోమవారం గుర్జకుంట గ్రామస్తులు మండల కేంద్ర శివారులో ఉన్న సిద్ధిరామేశ్వర ఆలయంలో స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం స్వామివారికి రోహిణి కార్తె రోజు జలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంతో పాటు పాఠశాలలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జుక్కల్ ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవా రం జుక్కల్ మండలం నాగుల్‌గావ్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకువెళ్తుందన్నారు.
కామారెడ్డి అర్బన్: ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మీడియా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 29న శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లో ‘ధ్యానం–సామాజిక శాంతి’ అంశంపై ఈ నెల మీడియా సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధి బీకే సంతోషి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మీడియా మిత్రులు 99129 16539 నంబర్‌కు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చని, హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ నుంచి 29న ఉదయం 9.30 గంటలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఓంశాంతి ప్రతినిధి సంతోషి పేర్కొన్నారు.


