పండుగ వేళ విషాదం
● బోల్తాపడిన ట్రాక్టర్.. యువతి మృతి
● రామారెడ్డిలో ఘటన
రామారెడ్డి : రామారెడ్డి గ్రామంలో బీరప్ప పండుగ వేళ ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో బీరప్ప పండుగ అనంతరం జరిగిన ట్రా క్టర్ ప్రమాదంలో యువతి మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డి భూషణంకు చెందిన ట్రాక్టర్‌ను బీరప్ప పండుగ ముగిసిన అనంతరం బంధువు నర్సింలు నడుపుతుండగా, పటేల్ చెరువు సమీపంలో అదుపుతప్పి పొలంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ ముందు భాగంలో కూర్చున్న భూషణం పెద్ద కు మార్తె శ్రావ్య (19) తీవ్రంగా గాయపడింది. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మేడ్చల్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి భూషణం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన దండు నారాయణ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌లో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నామని ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. అనుమతి లేకుండా ఇసుకరవాణా చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.


