పెద్దకొడప్‌గల్(జుక్కల్): బేగంపూర్ తండాలో భవాని మాత సేవలాల్ మహరాజ్ మందిర్ మూడో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం మహిళలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా బోనాలు, భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పిడుగు మమత నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకత్వం సోమవారం నియామకపత్రం జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని మమత పేర్కొన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు ఆమెను అభినందిస్తూ సన్మానించారు.


