రసవత్తరంగా కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా కుస్తీ పోటీలు

May 26 2026 3:14 AM | Updated on May 26 2026 3:14 AM

రసవత్తరంగా కుస్తీ పోటీలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): మాగి గ్రామంలో సోమవారం మల్లయోధుల కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. పోచమ్మ, ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా మల్లయోధులకు కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. చుట్టు ప్రక్క గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మల్లయోధులు కుస్తీ పోటీలకు తరలి రావడంతో హోరాహోరీగా జరిగాయి. గెలుపొందిన వారికి నగదు బహుమానంగా అందజేశారు. గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గుర్ర శ్రీనివాస్‌ పటేల్‌ తన తండ్రి జ్ఞాపకార్థం 3 తులాల వెండి కడియాన్ని విజేతకు బహుమానంగా అందజేశారు. సర్పంచ్‌ గుర్రపు సుమిత్ర, పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చీకోటి మనోజ్‌కుమార్‌, నాయకులు గుర్రపు శ్రీనివాస్‌ పటేల్‌, పండరి, శ్రీను, గంగారాం, ఎస్సై శివకుమార్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement