రీచార్జ్‌ అయ్యేదెలా? | - | Sakshi
Sakshi News home page

రీచార్జ్‌ అయ్యేదెలా?

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

రీచార్జ్‌ అయ్యేదెలా? చర్యలు చేపడతాం

‘గుంత’ల నిధులు ఇతర పనులకు మళ్లింపు!

ర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలు ఎంతో దోహదపడతాయి. ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలోనే బల్దియాలలో ముందస్తుగా ఇంకుడు గుంతల రుసుమును వసూలు చేస్తున్నారు. అయితే నిధులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ.. పనులు చేపట్టడంలో చూపడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఒక్క ఇంకుడు గుంతకు కూడా టెండర్లు నిర్వహించకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు, పాలకులు ఏళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఇంకుడు గుంతల పేరుతో వసూలు చేసిన నిధులను ఇతర అవసరాలకు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

వసూళ్లతోనే సరి..

కామారెడ్డి మున్సిపాలిటీలో 30 వేలకుపైగా ఇళ్లున్నాయి. బాన్సువాడలో 18 వేలు, ఎల్లారెడ్డిలో 10 వేలు, బిచ్కుందలో 7 వేల వరకు గృహాలు ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో ఏటా 400 నుంచి 500 వరకు కొత్త ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తుండగా.. బాన్సువాడలో 250, ఎల్లారెడ్డిలో 150, బిచ్కుందలో 100 చొప్పున అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఈ దరఖాస్తుతో పాటే ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మాణానికి సైతం అడ్వానన్స్‌గా రూ. 2,500 నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంకుడు గుంతల పేరుతో ఏటా రూ. రూ. 45 లక్షల వరకునిధులు బల్దియా ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఏడాదికి కామారెడ్డి బల్దియాకు రూ. 25 లక్షలు, బాన్సువాడలో రూ. 10 లక్షలు, ఎల్లారెడ్డిలో రూ. 6 లక్షలు, బిచ్కుందలో 3 లక్షల వరకు నిధులు వస్తున్నాయి.

మున్సిపాలిటీల్లో ఇంకుడు గుంతల నిర్మాణాల అంశాన్ని త్వరలోనే కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తాం. ఇంజినీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తాం. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి త్వరలోనే తగిన చర్యలు చేపడతాం.

– పర్వతాలు, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

మున్సిపల్‌ నిబంధనల ప్రకారం ఇలా వసూలైన నిధులతో ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా టెండర్లు నిర్వహించి, అనుమతి తీసుకున్న ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను తవ్వించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత బల్దియా అధికారులపైనే ఉంది. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నిధులను కౌన్సిల్‌ అనుమతితో ఇతర పనులకు మళ్లించి ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై పాలకవర్గాలు కూడా దృష్టి సారించడం లేదు. బల్దియా సాధారణ సమావేశాల ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరచడం గానీ, చర్చించడం గానీ చేయడం లేదు. తమ వద్ద ముందస్తుగా ఇంకుడు గుంతల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం చాలా మంది ఇంటి యజమానులకే తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఇంకుడు గుంతల నిర్మాణానికి టెండర్లు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్న తరుణంలో వాటిని రీచార్జ్‌ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను మున్సిపల్‌ అధికారులు గాలికొదిలేశారు. ఇంకుడు గుంతల నిర్మాణాల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే ఇంకుడు గుంతల రుసుమును వసూలు చేస్తున్నా.. ఏళ్లుగా ఒక్క గుంతనూ తవ్వించకపోవడం విమర్శలకు తావిస్తోంది. – కామారెడ్డి టౌన్‌

పట్టణాల్లో ఇంకుడుగుంతల

తవ్వకంపై నిర్లక్ష్యం

ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలో

అడ్వాన్స్‌లు స్వీకరిస్తున్న బల్దియాలు

ఏళ్లుగా ఒక్క గుంతకూ టెండర్లు

నిర్వహించని అధికారులు

పట్టించుకోని పాలకులు..

నీరుగారుతున్న సర్కారు లక్ష్యం

Advertisement
 
Advertisement
Advertisement