కలిసొచ్చిన యాసంగి | - | Sakshi
Sakshi News home page

కలిసొచ్చిన యాసంగి

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

కలిసొచ్చిన యాసంగి

మంచి దిగుబడి వచ్చింది

30 క్వింటాళ్లు పండినై..

జిల్లాలో యాసంగి సీజన్‌లో 2.57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. పంట సాగు మొదలు నుంచి కోత దశ వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించింది. దీంతోపాటు చీడ పీడల ప్రభావం లేకపోవడంతో పంటలపై పురుగు మందుల పిచికారి, రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో పెట్టుబడులు సైతం తగ్గాయి. ఇదే సమయంలో దిగుబడులు సైతం సాధారణం కన్నా నాలుగైదు క్వింటాళ్లు ఎక్కువగా వచ్చాయి. ఎకరానికి 28 నుంచి 34 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయని రైతులు పేర్కొంటున్నారు.

నత్తనడకన ధాన్యం సేకరణ

ప్రభుత్వం ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో వ రిధాన్యం కొనుగోళ్లు చేపడుతోంది. జిల్లాలో 399 కొ నుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 3.51 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం సేకరించారు. రైతుల ఖా తాలలో 668 కోట్ల రూపాయలు జమ చేశారు. మరో రూ. 21.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 99 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు పూర్తవగా.. ఇంకా 300 కేంద్రాల్లో తూకాలు కొనసాగుతున్నా యి. ధాన్యం సేకరణలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్‌ సమీపిస్తున్నా ఇంకా కుప్పలు తెప్పలుగా వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నాయి. ఇంకా 1.50 లక్ష ల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం సేకరించాల్సి ఉంద ని తెలుస్తోంది. సన్నరకం వడ్ల సేకరణ దాదాపు పూర్తి కాగా.. దొడ్డు రకం వడ్ల సేకరణ కొనసాగుతోంది.

యాసంగి సీజన్‌లో రైతులకు వరి సాగు కలిసొచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, చీడపీడల ప్రభావం తగ్గడంతో పెట్టుబడులు తగ్గాయి. మరోవైపు దిగుబడులు సైతం బాగుండడంతో రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే కొనుగోళ్లలో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారు. – నిజాంసాగర్‌

ఈసారి యాసంగి సీజన్‌ కలిసొచ్చింది. దొడ్డు రకం వరి పంట పండించిన. ఎకరానికి 32 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. మంచి దిగుబడులు రావడంతో నాలుగు పైసలు మిగిలినై..

– గొల్ల మల్లేశ్‌ యాదవ్‌, రైతు, నర్వ

16 ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. సన్నరకాలు ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు వచ్చినై. ఈసారి తెగుళ్ల బెడద లేకపోవడంతో పెట్టుబడి తగ్గింది. దిగుబడి పెరగడంతో రెక్కల కష్టానికి ఫలితం దక్కింది.

– కై దాపురం సాయిరెడ్డి, రైతు, గున్కుల్‌

తగ్గిన పెట్టుబడులు..

పెరిగిన దిగుబడులు

ఎకరాకు 28 నుంచి 34

క్వింటాళ్ల వడ్ల రాక

కొనసాగుతున్న కొనుగోళ్ల ప్రక్రియ

ఇప్పటికే 3.51 లక్షల

మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

Advertisement
 
Advertisement
Advertisement