కామారెడ్డి టౌన్ : వరి, మక్క కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించవద్దన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు నేల సారం దెబ్బతింటుందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుంచి నిర్వహించనున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయా లన్నారు. కామారెడ్డినుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆ దేశించారు. మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడరాఉ. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారంనుంచి 30 వరకు మహిళా సాధికారిత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయా లని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
‘ప్రజాపాలన’ కార్యక్రమాలను
విజయవంతం చేయండి
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు
భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


