మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
● మిల్లర్లకు అదనపు కలెక్టర్
విక్టర్ సూచన
● కొనుగోలు కేంద్రాలు,
రైస్‌మిల్లుల పరిశీలన
మాచారెడ్డి : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పెరిగిపోకుండా ఉండేందుకు రైస్ మిల్లర్లు రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్‌లోడ్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. ఆదివారం ఆయన చుక్కాపూర్, లచ్చాపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముగించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మిల్లర్లతో మాట్లాడి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లారీల కొరత రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
భిక్కనూరు : రైస్ మిల్లులలో ధాన్యపు నిల్వలు పెరగకుండా మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ రైస్‌మిల్లర్లకు సూచించారు. ఆదివారం మండలకేంద్ర సమీపంలోని రైస్‌మిల్‌ను సందర్శించి అన్ లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా సహకార అధికారి రామ్మోహన్, సివిల్ సప్లై డీటీ కృష్ణయ్య ఉన్నారు.


