● అన్నారం అన్నదాతల ఆగ్రహం
● మండుటెండలో రాస్తారోకో
రామారెడ్డి: చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నారంలో మండుటెండలో రాస్తారో కో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 40 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బందిపడుతున్నామన్నారు. తూకాలలో జా ప్యం జరుగుతోందని, దీంతో రోజూ వడ్ల కుప్పల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా తూకాలు పూర్తయ్యేలా చూడాలని కోరారు.


