బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
మాక్లూర్: బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో ఆదివారం చోటు చోసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. కల్లెడి గ్రామానికి చెందిన తూర్పు గంగాభూషన్(46) అనే రైతు బైక్‌పై పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో నిజాంసాగర్ కెనాల్ కల్వర్టు మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి కెనాల్‌లో పడి తీవ్రగాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంగాభూషన్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: మండలంలోని చేపూర్ గ్రామ శివారులో ఉన్న పేకాటస్థావరంపై ఆదివారం చీత ఫోర్స్ దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారి నుంచి రూ. 18,300 నగదు, రెండు కార్లు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.


