ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరా ల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన బక్కి నర్సయ్య(55) బైక్‌పై సిరిసిల్లలో ఉంటున్న తన కొడుకును కలిసేందుకు వెళ్తున్నాడు. వెంకటాపూర్ శివారులో ఎదురుగా వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూ పక్క నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రాహుల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మొదట గుర్తు తెలియ ని వ్యక్తిగా భావించగా మృతుడి ప్యాంటు జేబులో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా నర్సయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


