కారు, లారీ ఢీ | - | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

ముగ్గురికి గాయాలు

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ వద్ద 63వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన నలుగురు కారులో నిజామాబాద్‌ వెళ్తుండగా, నిజామాబాద్‌ నుంచి ఆర్మూర్‌ వైపు వస్తున్న లారీ అంకాపూర్‌ వద్ద కారును ఢీకొట్టింది. కారులో ఉన్న బెలూన్స్‌ బయటికి రావడంతో ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు వెంటనే కారులో ఉన్న నలుగురిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలు కాగా, మహేందర్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement