సాక్షి, నెట్‌వర్క్ : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్, రామారెడ్డిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకే వేదికపై తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను కలుసుకోవడంపై అటు గురువులు, ఇటు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారు.


