కుసుమ నూనెకు భలే డిమాండ్‌..! | - | Sakshi
Sakshi News home page

కుసుమ నూనెకు భలే డిమాండ్‌..!

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

మద్నూర్‌(జుక్కల్‌): వంట నూనెల ఎంపికతోనే ఆరోగ్యం బాగుంటుందని, మార్కెట్‌లో నూనెలు కల్తీ అవుతున్నాయని ప్రజలు కుసుమ నూనెను ఎంచుకుంటున్నారు. రిఫైన్డ్‌ నూనెతో పోలిస్తే గుండె ఆరోగ్యానికి కుసుమ నూనె బాగుంటుందని అధిక కొలెస్ట్రాల్‌ ఉండదని వైద్యులు చెబుతుండటంతో కుసుమ నూనెకు డిమాండ్‌ ఏర్పడింది. మండలంలో రైతులు పండించిన కుసుమ గింజలను ప్రజలు క్వింటాలుకు రూ.6 వేలతో కొనుగోలు చేసుకుంటున్నారు. క్వింటాల్‌ కుసుమలకు 27 కిలోల వరకు నూనె వస్తుందని వారు తెలిపారు. కుసుమ నూనెలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌–ఈ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, చర్మ సంరక్షణలో, బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతుండటంతో ప్రజలు కుసుమ నూనైపె ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని గానుగ నూనె మిషన్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement