● పీఎంశ్రీ పాఠశాలలో కొనసాగుతున్న శిక్షణ
● కుట్టుమిషన్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇండోర్‌గేమ్స్‌పై విద్యార్థుల ఆసక్తి
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం పీఎంశ్రీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. శిబిరానికి ప్రతి రోజూ 100 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కుట్టుమిషన్, కంప్యూటర్‌తోపాటు ఇండోర్ గేమ్స్‌లో ఉల్లాసంగా పాల్గొంటున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతున్న ఈ శిబిరంలో విద్యార్థులకు పలు అంశాలలో ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్లు శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లల్లో నైపుణ్యం పెంపొందించేందుకు వేసవి శిబిరాలు ఉపయోగపడుతుండటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
10 రోజులుగా బొల్లారం స్కూల్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి హాజరవుతున్నాను. కుట్టుమిషన్‌పై శిక్షణ పొందుతున్నాను. ఇండోర్ గేమ్స్ కూడా ఆడుతున్నాను. ఎండలో తిరగకుండా మంచి శిక్షణ ఏర్పాటు చేశారు.
– జ్యోతి, విద్యార్థి, పల్లెబోగుడతండా
నేను చెస్ నేర్చుకుంటున్నాను. సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్దామనుకున్నాను. కానీ, మా ఊర్లోని పాఠశాలలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకొని ఇంటి వద్దే ఉండి రోజూ శిబిరానికి వస్తున్నాను. చెస్ చాలా చక్క గా నేర్పుతున్నారు. – సాయికుమార్, విద్యార్థి, బొల్లారం
నేను కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ పొందుతున్నాను. రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిక్షణ శిబిరంలో కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. భవిష్యత్తులో నాకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది.
– సుమలత, విద్యార్థి, బొల్లారం


