ఎమ్మెల్యే చొరవతో దన్నూర్‌కు ఆర్టీసీ సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చొరవతో దన్నూర్‌కు ఆర్టీసీ సర్వీసులు

May 24 2026 1:51 AM | Updated on May 24 2026 1:51 AM

ఎమ్మెల్యే చొరవతో దన్నూర్‌కు ఆర్టీసీ సర్వీసులు కనీసం గుంతనైనా పూడ్చండి ..! మంజూరైన వారందరూ ఇళ్లు నిర్మించుకోవాలి

మద్నూర్‌(జుక్కల్‌): ఆ గ్రామానికి ఇంత వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేవు. గ్రామానికి వచ్చి న ప్రజాప్రతినిధులతో ఎల్లప్పుడు ఆర్టీసీ బ స్సు విషయంలో గ్రామస్తులు విన్నవిస్తుండేవా రు. ప్రజల విన్నపాలు విన్న జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసులను ప్రారంభింపజేశారు. దన్నూర్‌ గ్రామంలో శనివారం బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో గ్రామ సర్పంచ్‌ జయశ్రీ దేవిదాస్‌ పటేల్‌.. బస్సుకు పూజ చేశారు. బిచ్కుంద నుంచి దన్నూర్‌ మీదుగా మర్కెల్‌కు ఉదయం 9.45 గంటలకు బయలు దేరుతుందని తిరిగి అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని వారు తెలిపారు. ఉప సర్పంచ్‌ కవిత, నేతలు విఠల్‌రావ్‌, యాదవ్‌రావ్‌, గోవింద్‌, రామరావు, గ్రామస్తులున్నారు.

మద్నూర్‌(జుక్కల్‌): మూడేళ్లుగా డోంగ్లీ తహసీల్‌ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిపై పలు చోట్ల గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మోకాలి లోతు గుంతలు పడి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి ఈ మార్గంలో ఏర్పడి గుంతలనైనా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

బాన్సువాడరూరల్‌(బాన్సువాడ): ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారందరూ ఇళ్లు నిర్మించుకోవాలని బాన్సువాడ డీఎల్‌పీవో ప్రసాద్‌ సూచించారు. శనివారం ఆయన ఎంపీడీవో ఆనంద్‌తో కలిసి దేశాయిపేట్‌, సోమేశ్వర్‌ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణాల పురోగతి ఆధారంగా బిల్లులు మంజూరు చేస్తుందన్నారు. సర్పంచ్‌ జ్యోతి ప్రకాశ్‌, జీపీ కార్యదర్శి గీత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement