త్రుటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

May 24 2026 1:51 AM | Updated on May 24 2026 1:51 AM

వారం రోజుల్లో 162 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి జాతీయ రహదారిపై ప్రమాదం

డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు సమీపంలో ఉన్న చెట్లపొదలకు శనివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సబ్‌ స్టేషన్‌ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. విద్యుత్‌ సిబ్బంది ఆప్రమత్తతతో సబ్‌స్టేషన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా గడిచిన వా రం రోజుల్లో 162 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదై నట్లు పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన వారికి మొత్తం రూ.16 లక్షల జరిమానా విధించామని, న్యాయస్థా నం ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష ఖరారు చేసిందని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

డిచ్‌పల్లి: మండలంలోని దూస్‌గాం గ్రామానికి చెందిన వీఆర్‌ఏ నీరడి లింగవ్వ (76) అనారోగ్యంతో మృతి చెందినట్లు తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డి శనివారం తెలిపారు. గత కొంతకాలంలో అనార్యోగంతో బాధపడుతున్న లింగవ్వ, వృద్ధాప్యం, ఎండ వల్ల తీవ్ర జ్వరంతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పేర్కొన్నారు.

డిచ్‌పల్లి : డిచ్‌పల్లి జాతీయ రహదారిపై ఓ టిప్పర్‌ ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నది. అదే సమయంలో పక్క నుంచి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీని ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్‌ లారీని ఆపకుండా వెళ్లాడు. ధాన్యం లోడ్‌ లారీ, టిప్పర్‌ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచింది. ఈ విషయమై డిచ్‌పల్లి ఎస్సై హరీఫ్‌ వివరణ కోరగా ప్రమాదం జరిగింది వాస్తవమేనని, ఇరువురి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement