‘టూ టౌన్‌’ ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

‘టూ టౌన్‌’ ఎప్పుడో?

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

‘టూ టౌన్‌’ ఎప్పుడో? పురోగతి కరువు..

సెలవులకూ ఇబ్బందే..

జిల్లా పోలీస్‌ శాఖ పరిధిలో మూడు సబ్‌ డివిజన్లు, ఆరు సర్కిళ్లు, 23 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇంకా ఠాణాల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. పోలీసు విధులకు సంబంధించి జిల్లా కేంద్రంలో సమస్య తీవ్రంగా ఉంది. జిల్లా అయ్యాక కామారెడ్డి రూపురేఖలు మారుతున్నాయి. మున్సిపాలిటీలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో పట్టణం వేగంగా విస్తరిస్తూనే ఉంది. దీనికి అనుగుణంగా సమస్యలు, కేసులు పెరిగాయి. మరోవైపు జిల్లాకేంద్రంలో సహజంగానే బందోబస్తులు, ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా ఇప్పటికీ జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క పోలీస్‌ స్టేషన్‌ ఉంది. ఈ ఠాణాలో ఎస్‌హెచ్‌వోగా సీఐ స్థాయి అధికారి, ఐదుగురు ఎస్సైలు, ఇతర అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. లక్షకుపైగా జనాభా ఉన్న పట్టణంలో ఒకే పోలీస్‌ స్టేషన్‌ ఉండడంతో ఈ స్టేషన్‌లో పనిచేస్తున్నవారిపై పనిభారం అధికమవుతోంది.

సరిగ్గా పట్టణం మధ్యలో నుంచి రైల్వే లైన్‌ ఉంది. ప ట్టాలకు మరోవైపు ప్రాంతానికి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినా పనిభారం తగ్గే అవకాశాలుంటాయి. ఆ దిశగానూ సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు పట్టణంలో మహిళలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా ఉంటాయి. టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు ఇబ్బందిపడుతున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకంగా మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే వారికి ఇబ్బందులు ఉండవు.

పట్టణ జనాభా 1.20 లక్షలు దాటినా.. డి విజన్‌గా ఉన్నప్పటిలాగానే ఇప్పటికీ జిల్లాకేంద్రాన్ని ఒకే ఒక్క పోలీస్‌ స్టేషన్‌తో నెట్టుకువస్తున్నారు. దీంతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై పని భా రం పెరుగుతుంది. కేసులకు తోడు గత కొంత కాలంగా బందోబస్తులు పెరిగాయి. సిబ్బంది కొరత చాలాకాలంగా ఉన్నదే. ఆయా కారణాల తో కనీసం సెలవులు దొరకడం లేదని, కుటుంబాలకు సమయం ఇవ్వలేక పోతున్నామని ప లువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో

పోలీసులది కీలక పాత్ర. పెరుగుతున్న జనాభా, కేసుల సంఖ్య, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డి పట్టణం డివిజన్‌ స్థాయినుంచి జిల్లాకేంద్రంగా మారినా.. జనాభా లక్ష దాటినా.. ఇప్పటికీ ఒకటే పోలీస్‌ స్టేషన్‌ ఉంది. దీంతో ఉన్న పోలీసులపైనే పనిభారం పడుతోంది.

– కామారెడ్డి క్రైం

విస్తరిస్తున్న జిల్లాకేంద్రం

పెరుగుతున్న కేసులు, ట్రాఫిక్‌ సమస్యలు

ఉన్న ఒక్క ఠాణా పోలీసులపై

తీవ్రమైన పనిభారం

ప్రతిపాదనలకే పరిమితమైన

ట్రాఫిక్‌, మహిళా పీఎస్‌లు

Advertisement
 
Advertisement
Advertisement