కామారెడ్డి టౌన్: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఆర్‌కే విద్యాసంస్థల సీఈవో, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.జైపాల్ రెడ్డి.. పాట్రన్ మెంబర్‌గా ఎం.సదాశివ రెడ్డి వైస్ పాట్రన్ సభ్యులుగా చేరారు. శనివారం ఆయన ఛాంబర్‌లో కలెక్టర్ వారిద్దరినీ అభినందించారు. శాలువాతో సత్కరించి, సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలు, మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ వంటి అంతర్జాతీయ సేవా సంస్థలో ప్రముఖులు సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమని, యువత కూడా సేవా రంగంలోకి రావాలని కోరా రు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ ద్వారా జిల్లాలో మరింత విస్తృతంగా సేవలు అందిస్తామన్నారు. రెడ్‌క్రాస్ నోడల్ అధికారి శశికుమార్, ప్రతినిధులు దత్తాద్రి, విజయ్,తదితరులు పాల్గొన్నారు.


