కామారెడ్డి క్రైం: తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను కామారెడ్డి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రాజు రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19 న సాయంత్రం తన బంధువు రంజిత్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఉన్న ఓ ఖాళీ స్థలం వద్ద ఉన్నాడు. ఐదుగురు వ్యక్తులు అక్కడకు వచ్చి వారిని బెదిరించారు. రాజు రెడ్డి వద్దనున్న రూ.4 వేలు, రంజిత్ వద్దనున్న 300 దుబాయ్ ధరమ్స్ లాక్కొని యాప్ ద్వారా రూ.వెయ్యి ఖాతాకు బదిలీ చేసుకుని పరారయ్యా రు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదే ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, మహ్మద్ మోయి జ్, బొందీ లోకేష్, షేక్ షానవాజ్, మరో బాల నేరస్తునిగా గుర్తించారు. వారిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు. వీళ్లు ఒంటరిగా ఉన్న వాళ్లను గుర్తించి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి రూ.8300, సెల్‌ఫోన్‌లు, 300 ధరమ్స్, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసున్నామని తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.


