తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధి హామీ పథకంలో కొలతల ప్రకారం పనిచేస్తే పనికి తగ్గ వేతనం వస్తుందని టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణగౌడ్ అన్నారు. ఆయన శుక్రవారం తాడ్వాయి మండలంలోని కన్‌కల్ శివారులో నడుస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఫీల్డు అసిస్టెంటు రాజు, కూలీలు ఉన్నారు.
ఉపాధి హామీ పనుల పరిశీలన
భిక్కనూరు: బస్వాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఉపాధి హామీ పథకం ఏపీవో రాధిక సిబ్బంది ఉన్నారు.
ఎండపూట విశ్రాంతి తీసుకోవాలి
బాన్సువాడ రూరల్: ఇబ్రహీంపేట్ తండా శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ స్వరూప వసంత్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూలీలకు నీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. ఎండలు విపరీతంగా ఉన్నాయని, మధ్యాహ్నం పూట కూలీలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ కాశీరాంకు సూచించారు.


