స్పోర్ట్స్‌ స్కూల్‌ రాష్ట్రస్థాయి ఎంపికలకు 20 మంది | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ స్కూల్‌ రాష్ట్రస్థాయి ఎంపికలకు 20 మంది

Mar 29 2026 6:59 AM | Updated on Mar 29 2026 6:59 AM

స్పోర్ట్స్‌ స్కూల్‌ రాష్ట్రస్థాయి ఎంపికలకు 20 మంది

కామారెడ్డి అర్బన్‌: హైదరాబాద్‌ హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ నాల్గో తరగతిలో ప్రవేశం కోసం రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి 20 మంది ఎంపికై నట్లు జిల్లా అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్‌ తెలిపారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తొమ్మిది అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరగౌడ్‌ మాట్లాడుతూ.. 80 మంది క్రీడాకారులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభకనబర్చిన పది మంది బాలురు, పది మంది బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి హీరాలాల్‌, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, ఎస్‌జీఎఫ్‌ మాజీ కార్యదర్శులు పాక వెంకట్‌, రసూల్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement