● ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
● మంత్రులను కలిసి వినతిపత్రం అందజేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డిలో నూతనంగా బస్సు డిపోను ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. హైద్రాబాద్‌లో గురువారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ప్రిన్సిపాల్ సెక్రటరీ, టీజీయస్‌ఆర్టీసీ ఎండీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పాల్గొని పలు సమస్యలను వివరించారు. ఎల్లారెడ్డి పట్టణంలో నూతన బస్సుడిపోను ఏర్పాటు చేయాలని, ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, బాన్స్‌వాడ తదితర ప్రాంతాలకు అదనపు బస్సు లను నడపాలన్నారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టి అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని మంత్రులను ఎమ్మెల్యే అభ్యర్థించారు.


