సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించాలి

Mar 27 2026 9:21 AM | Updated on Mar 27 2026 9:21 AM

గాంధారి(ఎల్లారెడ్డి): వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో రవీందర్‌ గౌడ్‌ సూచించారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వార్డులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న సమస్యలు, మందుల నిలువ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. డాక్టర్‌ సంగీత్‌, ఉత్తునూరు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement