● అనంత టెక్నాలజీ వైస్ చైర్మన్, శాస్త్రవేత్త మాచర్ల నవీన్‌కుమార్
భిక్కనూరు: వికసిత భారత్, మేక్‌ఇన్ ఇండియాలో జియోఇన్ఫర్మాటిక్స్ టెక్నా లజీ కీలకపాత్ర పోషిస్తుందని అనంత టెక్నాలజీ వైస్ చైర్మన్, శాస్త్రవేత్త మాచర్ల నవీన్‌కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో మూడు రోజులుగా జరుగుతున్న జియోఇన్ఫర్మాటిక్స్ జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో భారతదేశంలో జీఐఎస్ విభాగంలో పది లక్షల ఉద్యోగాలు అవసరమని, కోటి పది లక్షలకు పైగా జియో స్పెషల్ విభాగంలో వ్యాపారం జరుగుతుందన్నారు. మొదటగా జీఐఎస్‌ను సైన్యం అవసరాల కోసం వాడేవారని ప్రస్తుతం జీఐఎస్ జీపీఎస్ లేని రంగం లేదన్నారు. చంద్రయాన్ –1, చంద్రయాన్–2, మంగళయాన్ విజయవంతమైన ప్రయోగాల్లో అ నంత టెక్నాలజీస్ కీలక పాత్ర పోషించిందన్నారు. విధ్యార్థులు జీపీఎస్ ఉపయోగించి ఏవిధంగా మ్యాపులను చిత్రీకరించాలో దోమకొండ గ్రామంలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మ్యాపులను ప్రత్యక్షంగా విద్యార్థులతో తయారు చేయించారు. ఎన్‌ఐఆర్‌డీ శాస్త్రవేత్త ఎం.వి.రవిబాబు, యోగి వేమన యూనివర్సిటీ ప్రొ ఫెసర్ శివప్రతాప్, తెలంగాణ యూనివర్సిటీ సైన్స్ డీన్ సంపత్, శాస్త్రవేత్త రా మస్వామి,సౌత్‌క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): ఈ నెల 28న గాంధారి తైబజార్, పశువుల దాఖలా చిట్టీ వేలం వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు గురువారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు తైబజారుకు రూ.1.5 లక్షలు, దాఖలా చిట్టీ వేలంకు రూ.35 వేల డిపాజిట్ చెల్లించాలన్నారు. తైబజారు, దాఖలా చిట్టీలు దక్కించుకున్న వారు 7 రోజుల్లో వేలం పాటలో 50 శాతం డబ్బులు చెల్లించాలన్నారు. మిగతా డబ్బులు వాయిదాల పద్ధతిలో పంచాయతీ నిబంధనల మేరకు చెల్లించాలన్నారు. వేలం పాటలో దక్కని వారికి చెల్లించిన డిపాజిట్‌లో నుంచి రూ.5 వేలు మినహాయించి మిగతా డబ్బులు అదే రోజు చెల్లిస్తామన్నారు.
కామారెడ్డి అర్బన్: ఫర్నిచర్ రంగంలో యువతకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడానికి హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన ఎఫ్‌ఎఫ్‌ఎస్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎన్‌ఎస్‌టీఐ ముందుకు వచ్చిందని అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం శిక్షణకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. కనీసం పదవ తరగతి పాసై 50 యేళ్లలోపు వారు వివరాలకు 76739 76699 నంబర్‌కు సంప్రదించాలని ప్రతినిధులు అనవిలాసిని, విశ్వనాథ్‌మోహన్ తెలిపారు.
కామారెడ్డి అర్బన్: అన్ని కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈబీసీ,మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యూవల్ కోసం ఏప్రిల్ 20 వరకు తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాల బాధ్యులు విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి తండాకు చెందిన బట్టు వినోద్, భార్య కవిత గురువారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడినట్లు ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. బట్టు బలరాం కొడుకు వినోద్ నాలుగు సంవత్సరాల క్రితం అదే తండాకు చెందిన బదావత్ గేమ్య వద్ద ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేశాడు.ఈ ప్లాట్ విషయంలో కొంతకాలంగా గేమ్య కుటుంబంతో గొడవ జరుగుతోంది.వినోద్ ఈ ప్లాట్‌లో ఇందిరమ్మ ఇల్లు ని ర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బుధవారం రాత్రి బట్టు వినోద్‌కు సంబంధించిన ఆవు బదావత్ నాందేవ్ ప్లాట్‌లోకి వెళ్లింది. దీంతో నాందేవ్ అతని భార్య, ఇద్దరు కొడుకులు, కోడలు వెళ్లి వినోద్, కవితలతో గొడవ పెట్టు కున్నా రు. తిరిగి గురువారం ఉదయం మళ్లీ గొడవ పెట్టుకోవడంతో మనస్థా పానికి గురైన వినోద్ అతని భార్య కవిత గుర్తు తెలియని మందు తాగి అపస్మారక స్థి తికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు వెంటనే వారిని నిజా మాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వారు తీసుకున్న మందు ఏమిటన్నదీ తెలియకపోవడంతో వైద్యులు సరైన చికిత్స అందించలేపోతున్నారని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం దంపతుల పరిస్థి తి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


