ఏడు నెలలుగా ఎదురుచూపులు
కమీషన్ డబ్బులు ఇవ్వాలి
● రేషన్ డీలర్లకు అందని కమీషన్
● ఇబ్బంది పడుతున్న డీలర్లు
దోమకొండ: జిల్లాలో రేషన్ డీలర్లకు కమీషన్ డబ్బులు అందడం లేదు. దీంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,337 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. ఒక్కో రేషన్ డీలర్ నెలకు 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా బియ్యం పంపిణీ చేస్త్న్ను రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా క్వింటాలుకు రూ. 55, రాష్ట్ర ప్రభుత్వం రూ. 85 చొప్పున అందిస్తున్నాయి. రాష్ట్రం వాటా అందుతున్నా కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం జూన్ నుంచి విడుదల కావడం లేదు. కమీషన్ డబ్బులు విడుదల కాకపోవడంతో తాము ఇబ్బందిపడుతున్నామని డీలర్లు పేర్కొంటున్నారు. హమాలీ డబ్బులు, రూం కిరాయి, కరెంట్ బిల్లు, బియ్యం అందజేస్తే వ్యక్తికి జీతం ఇవ్వడం ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కమీషన్ డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నారు.
రేషన్ బియ్యం పంపిణీ చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు కమీషన్ చెల్లిస్తాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.55 చొప్పున ఇస్తుంది. ఇది జూన్ నెల నుంచి రావడం లేదు. వెంటనే కమీషన్ డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలి.
– మల్లారెడ్డి, రేషన్ డీలర్ల సంఘం జిల్లా
ఉపాధ్యక్షుడు, దోమకొండ
ఏడు నెలలుగా ఎదురుచూపులు


