సేవ చేయడమే లక్ష్యం
బీబీపేట : ప్రతి గ్రామంలో పార్టీలకతీతంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చానని, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామలో నూతన సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులతో మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 గ్రామాల పంచాయతీల పాలకవర్గాల ప్రతినిదులు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సుభా ష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కనీసం లక్ష రూపాయల విలువ చేసే ఫర్నిచర్ అందిస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఫర్నిచర్ ఉన్నట్లయితే మరే అభివృద్ధికి అయినా సరే ముందుంటానని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు మిట్టపల్లి సురేందర్, పాటమ్మ రాంబాబు పాల్గొని పాటలు పాడారు.
● పార్టీలకతీతంగా గ్రామాలకు
ఫర్నిచర్ అందిస్తా
● ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్‌రెడ్డి


