హరినామ సప్తాహంలో మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మల్కాపూర్ శివారు హనుమాన్ ఆలయంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న హరినామ సప్తాహంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే పాల్గొన్నారు. వార్కారీలను సన్మానించి ఆలయంలో భజన, పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంవైపు వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు నాల్చర్ రాజు, వెంకట్‌రావు, డాక్టర్ రాజు తదితరులున్నారు.
కామారెడ్డి అర్బన్: స్థానిక ప్రసన్న వేంకటేశ్వరస్వామి పంచముఖి హన్‌మాన్ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి కళాకారిణి డాక్టర్ ఏ.మనోజ్ఞ, డాక్టర్ ఎస్సీ కృష్ణకుమారి బృందంతో ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ కిషన్‌రావు కోరారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో బగళాముఖి అమ్మవారి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు క్రాంతి పటేల్, వెంకటేశం, సతీష్, రేవంత్, సాయినాథ్ తదితరులున్నారు.
హరినామ సప్తాహంలో మాజీ ఎమ్మెల్యే


