యోగాతో ఆరోగ్యవంతమైన కుటుంబం
భిక్కనూరు: మహిళలు నిత్యం యోగ సాధన చేస్తే వారి కుటుంబం ఆరోగ్యవంతమైన కుటుంబంగా మారుతుందని భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ అన్నారు. ఆదివారం భిక్కనూరులో పతంజలి మ హిళ యోగ కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లా డారు. పాశ్చాత్యులు యోగ సాధన చేస్తుంటే మన వాళ్లు జిమ్‌ల వెంట తిరుగుతున్నారన్నారు.చిన్న పె ద్ద అనే తేడా లేకుండా అందరూ యోగ సాధనలో భాగమైనప్పుడు ఆరోగ్యం బాగుంటుందన్నారు. మనస్సుకు ప్రశాంతత కలుగడంతో పాటు ఏకాగ్రత ఏర్పడుతుందన్నారు. మండల కేంద్రంలో ఉచి త మహిళా యోగ కేంద్రాన్ని నిర్వహించేందకు మందుకు వచ్చిన రిటైర్డు లైబ్రేరియన్ నర్సింలును ఆమె అభినందించారు. సర్పంచ్ బల్యాల రేఖను శాలువాతో మహిళ యోగా సాధకులు సత్కరించారు.
కామారెడ్డి అర్బన్: టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో జనగామలో నిర్వహిస్తున్న రాష్ట్ర విద్య వైజ్ఞానిక మహాసభల్లో కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు, ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, రూప్‌సింగ్, నారాయణ, సురేష్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. వివక్ష లేని విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని, అందరికి సమాన విద్య అందించాలనే సందేశం ఇస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు బాబు పేర్కొన్నారు.


