ఏళ్ల తర్వాత.. ఒక్కచోటికి..
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు
నిర్వహించిన పూర్వవిద్యార్థులు
● ఆత్మీయ పలకరింపులతో
భావోద్వేగానికి గురైన మిత్రులు
బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 1973–75 బ్యాచ్ ఇంటర్ విద్యార్థులు
బోధన్‌టౌన్(బోధన్): వారంతా పూర్వ విద్యార్థులు. 50ఏళ్ల క్రితం ఇంటర్ చదివి ఎక్కడెక్కడో స్థిరప డ్డారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసి, రిటైర్డ్ అయిన అందరూ మళ్లీ ఇన్నేళ్లకు ఒకేచోట కలిశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973–75లో ఇంటర్ విద్యను అభ్యసించిన వి ద్యార్థులు ఆదివారం అదే కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని, చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో అలరించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, సాయిలు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
వేల్పూర్‌లో 47 ఏళ్ల తర్వాత..
వేల్పూర్: వేల్పూర్ హైస్కూలులో 1977–78 ఎ స్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. పాఠశాలలో చదు వుకున్న రోజులు గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఒకరినొకరి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
కామారెడ్డిలో 30 ఏళ్ల తర్వాత..
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి వివేకానంద పాఠశాల 1994–95 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పట్టణంలోని ఓ హోటల్‌లో పూర్వ విద్యార్థు లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ వారంతా ఒక్కచోట కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నాడు బోధించిన ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
భీమ్‌గల్‌లో 25 ఏళ్ల తర్వాత..
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ జెడ్పీహెచ్‌ఎస్‌ల 1999–2000 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ వారంతా ఒకేచోట కలుసుకోవడంతో ఆప్యాయంగా పలుకరించుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
వెల్మల్‌లో 21 ఏళ్ల తర్వాత..
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని వెల్మల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 2003–04 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వీరంతా 21 ఏళ్ల తర్వాత కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాడు చదువు చెప్పిన గురువులను సన్మానించారు.
నిజాంసాగర్ నవోదయలో..
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సదరు విద్యాలయం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు చదివిన సుమారు 33 బ్యాచ్‌ల విద్యార్థులు పాల్గొన్నారు. నవోదయలో చదివి ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉన్నవారితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ప్రయివేట్ కంపెనీలు స్థాపించిన విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. నవోదయ ప్రిన్సిపాల్ సీతారాంబాబు, పూర్వ విధ్యార్థులు పాల్గోన్నారు.
ఏళ్ల తర్వాత.. ఒక్కచోటికి..
ఏళ్ల తర్వాత.. ఒక్కచోటికి..


