‘కర్షక పీడిత ప్రజల మనిషి వీఎల్’
కామారెడ్డి అర్బన్: సీనియర్ న్యాయవాది, సీపీఐ నాయకుడు వీఎల్ నర్సింహారెడ్డి ప్రజాస్వామికవాదిగా పేదలు, కార్మిక, కర్షక, పీడిత ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా మనిషి అని సీపీఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ అన్నారు. ఆదివారం కామారెడ్డి జీఎస్‌ఆర్ కళాశాలలో వీఎల్ నర్సింహారెడ్డి సంస్మరణ సభ నిర్వహించగా.. సీపీఐ జిల్లా కార్యదర్శి దశరథ్ అధ్యక్షత వహించారు. నర్సింహారెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలు నిర్బంధానికి గురైనప్పుడు వారి పక్షాన ఉండి అనేక బెయిళ్లు ఇప్పించి ఉచితంగా వాదించారని, పేదల న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారని నేతలు కొనియాడారు. న్యాయవాదులు క్యాతం సిద్ధిరాములు, వెంకటరాంరెడ్డి, వేణుగోపాల్, నవీన్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్): కుర్తి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన సందర్భంగా ఆదివారం గ్రామ ప్రజలు ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింఽధే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు విచ్చేసిన ఎమ్మెల్యేను, సర్పంచ్ సాయవ్వలను గ్రామస్తులు, పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు గ్రామంలో విజయత్సోవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ పని చేయాలని, తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.
కామారెడ్డి అర్బన్: మనిషిని మాధవుడిగా మార్చే గొప్ప శక్తి అయ్యప్పమాలకు ఉందని, మాలధా రుల్లో 40 రోజుల తర్వాత మార్పురాకపోతే ఫలితం శూన్యమని వైశ్యుల కులగురువు, హల్థీపురం పీఠాధిపతి వామనశ్రమ స్వామీజీ అన్నారు. కామారెడ్డి అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర మ హా కుంభాభిషేకం కార్యక్రమంలో వామనశ్రమ స్వామీజీ పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో వేదపండితుడు అంజనేయశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు నస్కంటి శ్రీనివాస్, గొనే శ్రీనివాస్, పట్నం రమేష్, తదితరులు పాల్గొన్నారు.
‘కర్షక పీడిత ప్రజల మనిషి వీఎల్’
‘కర్షక పీడిత ప్రజల మనిషి వీఎల్’


