అద్దె అరకలకు డిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకలకు డిమాండ్ పెరిగింది. ఒక్క రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు తడి పంటల సాగు పనులను రైతులు పూర్తి చేసుకుంటున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం, తెల్గాపూర్, శేర్‌ఖాన్‌పల్లి, శనివార్‌పేట గ్రామాల్లో ఆరుతడి పంటలు జోరుగా సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నాగలి, ఎడ్లు లేకపోవడంతో ఆరుతడి పంటల సాగుకు అద్దె అరకల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ ప్రాంతాల్లో ఉన్న ఎడ్లను అద్దెకు తీసుకు వచ్చి ఆరుతడి పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నం అవుతున్నారు. నాగటేడ్లకు రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఎడ్లకు అద్దె ఇస్తూ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. గ్రామాల్లో పశువుల సంతతి రోజురోజుకు కనుమరుగవడంతో రైతులకు వ్యవసాయం కష్టంగా మారింది.
కామారెడ్డి అర్బన్: హైదరాబాద్ శంషాబాద్‌లోని జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహించే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 44వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలో ఏబీవీపీ మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు తరలిరావాలన్నారు. ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్, ప్రతినిధులు గిరి, స్వామి, అనిల్, సంజయ్, కౌశిక్, అక్షయ్, అజార్ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలో ఉచి త మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తామని, తమకు అందరూ సహకరించా లని వెస్టర్న్ ఆస్పత్రి వైద్యులు సయ్య ద్ అక్బర్ హసన్, ఫైజల్‌లు అన్నారు. ఆదివారం వారు భిక్కనూరు జీపీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సూచన మేరకు తాము భిక్కనూరులో పెద్ద ఎత్తున ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించేందుకు వచ్చామన్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలను నిర్వహింపజేస్తామన్నారు. సర్పంచ్ బల్యాల రేఖ, ఉప సర్పంచ్ దుంపల మోహన్‌రెడ్డి, నేతలు ఎడ్ల రాజిరెడ్డి, సుదర్శన్, లింబాద్రి వార్డు సభ్యులున్నారు.
అద్దె అరకలకు డిమాండ్
అద్దె అరకలకు డిమాండ్


