నిబంధనలు పాటించకపోతే ఆటోలు సీజ్
దోమకొండ: ఆటో రిక్షాల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల భద్రత ముఖ్యమని, ఆటోలకు ఫిట్‌నెస్‌తో పాటు పర్మిట్ కచ్చితంగా ఉండాలని జిల్లా సహయక మోటర్ వాహనాల తనిఖీ ఇన్‌స్పెపెక్టర్ కృష్ణతేజ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్‌లకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలపై విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడిపితే సీజ్ చేస్తామన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఆటో డ్రైవర్‌లు పాల్గొన్నారు.
క్రైం కార్నర్


