రంగుల ముగ్గు ప్యాకెట్ల పంపిణీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ముగ్గుల ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు పంపరి శ్రీనివాస్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, రవి, జూలూరి సుధాకర్, సలీం, తాటి ప్రసాద్, గడ్డమీది మహేష్, రంగా రమేష్ గౌడ్, చిన్న పోచయ్య, నవీన్, ఆబిద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ను మాజీ డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిలు శాలువాలతో సత్కరించారు.


