ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ
భిక్కనూరు: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో రాజీవ్‌గాంధీ సంఘటన మిషన్ ప్రతినిధి సుభాష్ భాయ్‌తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బిల్లుతో ఉపాధి హామీ కూలీలకు భవిష్యత్తులో జరిగే నష్టాలను వివరించారు. సర్పంచ్ చేపూరి రా ణి, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు సూ ర్యకాంత్‌రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణారెడ్డి, రాజు, శశికుమార్, కల్యాణి, రవి, ఉపాధి కూలీలు ఉన్నారు.


