జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: వనపర్తిలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్రస్థాయి అండర్–14 బాలికల హాకీ పోటీల్లో కేజీబీవీ కామారెడ్డి పాఠశాల 8వ తరగతి విద్యార్థి బి.పవిత్ర ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. శనివారం పాఠశాల ప్రత్యేకాధికారి టి.లావణ్య, వ్యాయామ ఉపాధ్యాయురాలు స్రవంతి, టీచర్లు పవిత్రను అభినందించారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ..
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రమేశ్, అర్జున్, సాయితేజ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీఈటీ గణేష్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్స్‌పాల్ సుధాకర్ మాట్లాడుతు శనివారం అండర్ 14లో నిజామాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో గురుకుల పాఠశాల ముగ్గురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా తాండూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో వీరు పాల్గొంటారని ఆయన తెలిపారు. పీఈటీ గణేష్, ఉపాధ్యాయులు సంతోష్, నాగరాజు పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లు
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు కరాటే, హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయా జిల్లాలకు శనివారం బయల్దేరి వెళ్లారు. గోదావరిఖనిలో ఈనెల 29 వరకు నిర్వహించే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కరాటే రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది క్రీడాకారులతో అండర్–17 బాలబాలికల జట్టు వెళ్లిందని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే.హీరాలాల్ తెలిపారు. అలాగే నారాయణపేట్‌లో నిర్వహించనున్న హ్యాండ్ బాల్ అండ్ – 14 పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వెళ్లారన్నారు. హ్యాండ్ జట్టుకు ఉప్పల్‌వాయి పీడీ సురేశ్ టీం కోచ్‌గా, ఎక్లారా పీడీ మౌనిక మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు హీరాలాల్ తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్: జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ వద్ద డీజేఎఫ్‌టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. డెస్క్ జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు మద్దతుగా టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే (143) నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జమాల్‌పూర్ గణేశ్, భూపతి, సుభాష్, పంచరెడ్డి శ్రీకాంత్, రాంచందర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, డెస్క్ జర్నలిస్టుల ఫోరం అడహక్ కమిటీ కన్వీనర్ చిట్నే భీంరావ్, కో–కన్వీనర్లు శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, నరేంద్ర, స్వామి, రాకేష్, సందీప్, సలహాదారులు కేవీ రమణ, భద్రారెడ్డి, ప్రభాకర్, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక


